ఈ ఏడాది పెళ్లిపీటలెక్కనున్న ముద్దుగుమ్మలు.. 

04 January 2024

గతేడాది పెళ్లి పీటలెక్కిన వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఇక గతేడాది బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాను పెళ్లాడింది. సెప్టెంబర్ 24న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

అలాగే 2023లో వివాహం చేసుకున్న మరో బ్యూటీ.. స్వర భాస్కర్‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ అహ్మద్‌తో ఏడడుగులు నడించింది.

ఈ ఏడాది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఈ బ్యూటీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక తమన్నా సైతం ఈ ఏడాది పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉన్న ఈ చిన్నది పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

అందాల తార అదితి కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థలో ప్రేమలో ఉన్న చిన్నది త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న నటి శృతి హాసన్‌ సైతం ఈ ఏడాది పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్‌. 

ఇక అందాల తార సంయుక్త మేనన్‌ సైతం ఇదే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఏర్పాట్ల కారణంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిందని వార్తలు వచ్చాయి.