100 నుంచి 500 అడుగులు.. మన హీరోల భారీ కటౌట్‌లు ఇవే..

25 May 2025

Prudvi Battula 

2014 సెప్టెంబర్‌లో తొలిసారి విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద ఆగడు టైమ్‌లో 100 అడుగుల మహేష్ బాబు కటౌట్‌ ఏర్పాటు చేసారు.

2018 డిసెంబర్‌ నెలలో హైదరాబాద్‌లో కథానాయకుడు రిలీజ్ టైమ్‌లో 100 అడుగుల బాలయ్య కటౌట్‌ ఏర్పాటు చేశారు.

2024లో అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల సందర్భంగా విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ వద్ద 108 అడుగుల కటౌట్.

అదుర్స్ రిలీజ్ టైమ్‌ 2009 నవంబర్‌లో కూకట్ పల్లి నిజాంపేట క్రాస్ రోడ్స్‌లో 120 అడుగుల ఎన్టీఆర్ కటౌట్‌ ఏర్పాటు చేశారు.

2023లో 'భోలా శంకర్' విడుదల సమయంలో సూర్యాపేట-విజయవాడ జాతీయ రహదారిపై 126 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసారు చిరు అభిమానులు.

2023లో సలార్ పార్ట్ 1: సీజ్‎ఫైర్ విడుదల సమయంలో హైదరాబాద్‌లో 230 అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేసారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్.

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‎కి ముందు విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్.

ఫతేహ్ సినిమా రిలీజ్‌ సందర్భంగా సోలాపూర్‌లో 500 మంది చిన్నారులు కలిసి 390 అడుగుల సోనూసూద్ కటౌట్‌ ఏర్పాటు.