వెంకీ దారిలోనే వారంతా.. ప్రొమోషన్స్ విషయంలో తగ్గదేలే.. 

20 May 2025

Prudvi Battula 

ఓ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అన్నట్లు సంక్రాంతికి వస్తున్నాంను జనాల్లోకి తీసుకెళ్లారు అనిల్ రావిపూడి.

నిర్మాతకు రూపాయి ఖర్చు లేకుండా ఉన్నచోటు నుంచే స్కిట్స్‌తో ప్రమోషన్ చేసారు. ఇవి బాగా ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి..

సినిమాను కచ్చితంగా ఫస్ట్ డే చూడాలనిపించేలా వర్కవుట్ అయ్యాయి. ఇదే రూట్ మిగిలిన హీరోలు కూడా ఎంచుకుంటున్నారిప్పుడు.

నవీన్ పొలిశెట్టి ముందు నుంచి కూడా తన సినిమాలను డిఫెరెంట్‌గా ప్రమోట్ చేస్తుంటారు. అనగనగా ఒకరాజు విషయంలోనూ ఇదే చేస్తున్నారు.

ఇటీవల కిరణ్ అబ్బవరం ఇదే దారిలో వెళ్తున్నారు. ఆ మధ్య K ర్యాంప్ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో బాగా పేలింది.

అందుకే దిల్ రుబా ట్రైలర్ లాంఛ్ కోసం ఇలాంటి వీడియోనే చేసారు కిరణ్. చూస్తున్నారుగా.. తనపై తానే సెటైర్లు వేసుకుంటూ వీడియో  చేసార కిరణ్ అబ్బవరం.

మొన్నటికి మొన్న హీరో నితిన్ సైతం రాబిన్ హుడ్ సినిమా కోసం వెంకీ కుడుములతో ఈ తరహా వీడియోనే ప్లాన్ చేసారు. ఇప్పుడు తమ్ముడు కూడా ఇలాగె ప్రమోట్ చేస్తున్నారు.

దీనికి ముందు ఆయ్ కోసం టీంతో కలిసి బన్నీవాస్ డిఫెరెంట్ కంటెంట్ రిలీజ్ చేసారు. మ్యాడ్ స్క్వేర్ కోసం ఇలాంటి ప్రమోషనే చేస్తున్నారు. ఇదే టాలీవుడ్‌లో ట్రెండ్ ఇప్పుడు.