సుడిగాలి సుధీర్‌తో నటించిన ఈ హాట్ బ్యూటీలు.. ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండింగ్.!
Ravi Kiran
13 May 2024
తెలుగు బుల్లితెరకు పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. మెజీషియన్‌గా తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత కామెడీ షోలో స్కిట్స్ చేశాడు.
అనంతరం జబర్దస్ట్‌లో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఒక హోస్ట్‌గా పలు రియాల్టీ షోలు చేశాడు. ఇక నెక్స్ట్ హీరోగా వెండితెర మీద మెరిశాడు సుడిగాలి సుధీర్.
సోలో హీరోగా సుడిగాలి సుధీర్ చేసినవి నాలుగు సినిమాలే. ఇందులో ఒకటి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'గాలోడు', 'కాలింగ్ సహస్ర', 'G.O.A.T'.
ఇక సుధీర్ సరసన నటించిన ఓ ఇద్దరు హీరోయిన్లు.. ఇప్పుడు ఇన్‌స్టాలో తమ గ్లామరస్ ఫోటోలతో ట్రెండింగ్‌లో ఉన్నారు.
డాలీషా.. సుధీర్ సరసన కాలింగ్ సహస్ర సినిమాలో నటించిన ఈ అందాల భామ. తన గ్లామరస్ ఫోటోలతో ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది.
వెకేషన్‌కి వెళ్లినా.. కొత్తగా ఫోటోషూట్స్ చేసినా.. ఈ వయ్యారి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
దివ్యభారతి.. ఈ తమిళ పొన్ను.. సుడిగాలి సుధీర్ సరసన 'G.O.A.T' అనే చిత్రంలో నటిస్తోంది. 'బ్యాచిలర్'తో ఫేమస్ అయిన దివ్యభారతికి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ మిలియన్లలో ఉన్నారు.
తాజాగా దివ్యభారతి శ్రీలంకలో వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాల నడుమ ఆమె తీసిన గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.