సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పెద్దోడు పాత్రకి ఫస్ట్ ఆప్షన్ ఆ హీరో..
Prudvi Battula
17 February 2025
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్, మహేశ్‌బాబు హీరోలుగా నటించిన మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.
2013లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో అంజలి, సమంత హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి, రావు రమేష్, రవి బాబు కీలక పాత్రల్లో నటించారు. మురళి మోహన్ అతిధి పాత్రలో కనిపించరు.
ఈ చిత్రంలో సీత పాత్రలో అంజలి జీవించింది. తాజాగా ఈ చిత్రం గురించి గుర్తు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలో వెంకటేశ్, మహేశ్‌బాబు పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో మెప్పించారు.
గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడు పాత్ర కోసం ముందుగా పవన్‌కల్యాణ్‌ని అనుకున్నామని చెప్పారు.
పవర్ స్టార్ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండి అది కుదరకపోయడంతో హీరో వెంకటేష్‌ని పెట్టినట్టు తెలిపారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క చేసిన ఈ పాత్రలకు టేక్ ఏ బౌ అనాల్సిందే..
మంచి కిక్కే ఇచ్చే ఈ తెలుగు స్పోర్ట్ డ్రామాలు కచ్చితంగా చూడాలి..
ఫుడ్ టూ సినిమా.. డార్లింగ్‌కి ఇష్టమైనవి ఇవే..