వెండి తెరపై ఆకట్టుకుంటోన్న తెలుగందం

13 August 2023

Pic credit - Instagram

గంగోత్రి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైని కావ్య. బలగం, మసూద వంటి చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

బేబీ మూవీతో సెన్సేషన్‌గా మారిన వైష్ణవి చైతన్య హైదరాబాద్‌లోని చంద్రాయణ గుట్టలో జన్మించింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోందీ చిన్నది. 

వెండి తెరపై తనదైన ముద్ర వేస్తున్న మరో తెలుగమ్మాయి ప్రణవి. స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌తో వెండి తెరకు పరిచయమైన ఈ చిన్నది వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటోంది.

తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటోంది శివాని రాజశేఖర్‌. తండ్రి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అచితూచీ సినిమాలు చేస్తోంది.

ఇక శివాత్మిక కూడా మెప్పిస్తోంది. దొరసాని మూవీతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంది. 

శ్రీలీల కూడా తెలుగమ్మాయనే విషయం తెలిసిందే. పెళ్లిసందడితో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది ప్రస్తుతం పది సినిమాల్లో నటిస్తోంది. బడా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. 

రీతూవర్మ సైతం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చూపులు మూవీతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూనే తనదైన నటనతో మెప్పిస్తోంది. 

ఈషా రెబ్బా కూడా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటించినవి తక్కు సినిమాలే అయినా పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.