అందాల తార సమంత చదువులో కూడా నెంబర్ వన్. సమంత తన విద్యాభాసాన్ని చెన్నైలో పూర్తి చేసింది. బీకామ్ పూర్తి చేసిన సామ్.. 2010లో ఏమాయ చేశావేతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
నేషనల్ క్రష్‌గా ఇండియన్ సినిమాపై ఓ వెలుగు వెలుగుతోన్న అందాల తార రష్మిక.. సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2016లో కిరాక్ పార్టీతో హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయమైందీ బ్యూటీ.
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా చదువుల్లో బెస్ట్‌గా నిలిచింది. ఈ బ్యూటీ బీఎస్పీ పూర్తి చేసింది. 2009లో విడుదలైన జల్లి మూవీతో సినిమాలకు ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాస్ మీడియాలో బీఏ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం 2007లో లక్ష్మీ కళ్యాణం ద్వారా వెండి తెరకు పరిచయమైంది.
నటన నేపథ్యం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్‌తో డిగ్రీ పూర్తి చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటున్న చెన్నై చిన్నది ప్రియ భవాని శంకర్ ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టింది.
సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు డాక్టర్ విద్యను కొనసాగిస్తూనే మరోవైపు నటిగా కూడా రాణిస్తుంది అందాల తార.
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2005లో బాలీవుడ్ సినిమా ద్వారా ఈ అందాల తార ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.