చిరుగాలి ఏనాడు ఈ సుకుమారిని స్పృశించే వరం పొందిందో.. మెస్మరైజ్ తేజు..
16 April 2025
Prudvi Battula
Credit: Instagram
22 నవంబర్ 1995 కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించింది సీరియల్ నటి తేజస్విని గౌడ. తన అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోలోని బెంగళూరు మాక్స్ ముల్లర్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.
బెంగళూరులోని రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బి.టెక్‌లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.
ఆమె కళాశాలలో ఉన్నప్పుడు మోడల్‌గా షోబిజ్‌లో తన నటన ప్రారంభించింది. తర్వాత ఆమె వివిధ టీవీ షోలకు ఆడిషన్స్‌లో పాల్గొంది.
స్టార్ మాలో ప్రసారమైన కోయిలమ్మ ధారావాహికలో కోకిల (చిన్ని) అనే పాత్రలో కనిపించింది. తెలుగులో ఈమె తొలి సీరియల్ ఇది.
కోయిలమ్మలో ఈమె నటనకిగాను స్పెషల్ జ్యూరీ అవార్డు, బుల్లితెర అవార్డులు వరించాయి. అలాగే రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్, జీ తమిళ్ (2023) అవార్డు అందుకుంది.
ఆమెకు “తేజస్విని_గౌడ” అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది మరియు 2023 నాటికి పది లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
తేజస్విని శాస్త్రీయ నృత్యంలో నైపుణ్యం కలిగి ఉంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పవన్ తొలి సినిమా పారితోషకం అంతేనా.?
టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడో తెలుసా.?
ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?