తేజస్వి నయగారాలు.. నయా లుక్స్ కి ఫిదా అవుతున్న కుర్రకారు
Phani CH
06 Jul 2025
Credit: Instagram
సీరియల్ నటి తేజస్విని గౌడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో సూపర్ క్రేజ్ ఉంది.
కోయిలమ్మ, అనసూయ వంటి సీరియల్స్‌తో తెలుగులో పాపులర్ అయిన తేజస్విని కన్నడలో కూడా పలు సీరియల్స్ లో నటించింది.
కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాదు, కన్నడలోను తన సత్తా చాటుకుంది. కన్నడలో 'బిలి హెంద్తి' అనే సీరియల్‌లో రమ్య పాత్రలో నటించి కన్నడ ప్రేక్షకుల్ని మెప్పించింది.
ఇక తెలుగు నటుడు అమర్‌దీప్ చౌదరితో పెళ్లి అయిన తర్వాత తేజస్విని జోడి హిట్ పెయిర్ అయిపోయింది. వీళ్లు కలిసి పలు డ్యాన్స్, రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు.
ఆమెకు “తేజస్విని_గౌడ” అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది మరియు 2023 నాటికి పది లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
తేజస్విని గౌడ్ తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడ ముందుకు తీసుకెళ్తూ, అభిమానుల ప్రేమ అభిమానులతో ముందుకు సాగుతోంది.
ఇక నీతోనే డ్యాన్స్, స్టార్ మా పరివారం, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ ఇలా ఎన్నో షోలలో కూడా తేజు సందడి చేసింది.