13 August 2023

సౌత్ ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీ తమన్నా స్పీడ్.. తగ్గేదే లే.!

హ్యాపీ డేస్ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటికి 18 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. 

ప్పటికీ స్టార్ హీరోయిన్ గా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ.ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తోంది. 

ఆమె నటించిన సినిమాలు వరసగా విడుదలవుతున్నాయి. తమన్నా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయిన సంగతి తెలిసిందే.

తమన్నా ‘జైలర్‌’లో నటించింది. ఇందులో ఆమె పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంది.

అలాగే తమన్నా తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాలో కూడా నటించింది. చిరంజీవికి జోడీగా మిల్కీబ్యూటీ కనిపించింది.

ఇక మరోవైపు ఈ బ్యూటీ చేతిలో అటు వెబ్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తోంది.

జైలర్, భోళా శంకర్ విడులయ్యాయి. దీంతో తమన్నా మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతుందనే ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటె మరోపక్క సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోజులతో యూత్ ను గట్టిగానే ఆకర్షిస్తుంది ఈ వయ్యారి భామ తమన్నా