క్యాస్టింగ్ కౌచ్ పై తాప్సి కామెంట్స్.. నెట్టింట హాట్ టాపిక్
Pic credit - Instagram
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ కు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పరిచయం చేసిన అందం తాప్సీ.
ఫస్ట్ సినిమాతోనే తన అందచందాలు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కానీ దురదృష్టవశాతు తన తదుపరి అన్ని సినిమాల్లోనూ ఆమెకు లీడ్ హీరోయిన్ ఛాన్స్ రాలేదు.
టాలీవుడ్ లో టైం బాగోలేదని బాలీవుడ్ దిశగా తన ప్రయత్నాలు కొనసాగించి అవకాశం దక్కించుకుంది. వరుస సక్సెస్ లు రావడంతో అక్కడే తాప్సీ సెటిల్ అయిపోయింది.
తాప్సి వ్యక్తిగత విషయాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు బాలీవుడ్ మీద కూడా తాప్సీ పలు రకాల కామెంట్స్ చేస్తూనే ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఇంటర్వ్యూలో తాప్సికి క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానంగా.. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని బాంబు పేల్చింది.
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదట్లో చాలామంది ఫోన్ చేసి రాత్రుళ్లు గెస్ట్ హౌస్ కు రావాలని డిమాండ్ చేసేవారని.. నేను రానని చెప్పినప్పటికీ వారు వినేవారు కాదని వాపోయింది.
అలా ఓ ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ చేయకుంటే తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని బెదిరింపులకు సైతం దిగారట.
హీరోలే కాకుండా తనను అలా డైరెక్టర్లు కూడా బెదిరించారని తెలిపింది. వాటన్నిటిని తాను సీరియస్ గా తీసుకోలేదంటూ చెప్పుకొచ్చింది.