08 August 2023

తలైవాతో అట్లుంటది.. దెబ్బ అదుర్స్ కదూ.!

ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్న సూపర్ స్టార్ ఎవరంటే టక్కున చెప్పే పేరు రజినికాంత్.

ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన ఆయన క్రేజ్ ను బీట్ చేయడం ఎవ్వరి వల్లా కాదు.

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న మొదక్టి సౌత్ హీరోగా సూపర్ పేరిట రికార్డ్ ఉంది.

ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.

ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక జైలర్ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది.

కాగా ఈ మూవీకోసం సూపర్ అందుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా 110 కోట్లు అని తెలుస్తోంది.

ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దళపతి విజయ్ ఉన్నారు.

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ 100 కోట్ల రెమ్యునరేషన్ మార్క్ ను టచ్ చేశారు.

రజినీకాంత్ సినిమా అంటే 500 కోట్ల వసూళ్లు అవలీలగా రాబడుతుంది.

ఇక ఇప్పుడు జైలర్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.