10 AUGUST 2023

‘మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు’..:రజినీకాంత్

సూసర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోతాయ్‌.

అందుకే ఆయన సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తుంటారు.

తాజాగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన కొత్త మువీ ‘జైలర్‌’. నేడు  ప్రపంచవ్యాప్తంగా జైలర్‌ మువీ విడుదలైంది.

కాగా ఇటీవల ఈ మువీ ఆడియో రిలీజ్‌ ఫంజక్షన్‌ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై రజనీ ఇచ్చిన స్పీచ్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.

నిజానికి సూపర్‌స్టార్‌ కిరీటం నాకు ఎప్పుడూ తలనొప్పిగానే ఉంది.

కానీ నేను వాటి గురించి పట్టించుకోను. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు..

ఇవి రెండూ లేని ఊరూ లేదు. ఎవరేం అనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోతుండాలి.

ఐతే రజనీకాంత్‌ తాజా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే అంశం కూడా చర్చణీయాంశంగా మారింది.