మహేష్ గ్యారేజ్ లో మరో కొత్త కార్.. బాబు రేంజ్ కు తగట్టే..

6 August 2023

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో మహేష్ బాబు ఒకరు

అంతేకాదు అనేక ప్రముఖ బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనలకు మహేష్ బెస్ట్ ఎంపిక అని భావిస్తారు

మంచి మానవత్వం ఉన్న హీరో.. పలు సామజిక కార్యక్రమాలను చేస్తున్నాడు.

మహేష్ బాబు తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.

మహేష్ బాబు ఇటీవల రేంజ్ రోవర్ కారు కొన్నాడు.

సాధారణంగా అందరూ గ్రాఫైట్ బ్లాక్, బ్లాక్, వైట్ కలర్ రేంజ్ రోవర్ కొంటారు.. అయితే మహేష్ బాబు మాత్రం గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్నాడు.

ఈ కారు కోసం మహేష్ బాబు 5.4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇది రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్.