పాపం సన్నీలియోన్‌.. మూడు కార్లను ఇష్టంగా తెచ్చుకుంది.. కట్‌చేస్తే వరదల్లో..

11 August 2023

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సౌత్‌ సినిమాల్లోనూ నటిస్తోంది.

మంచు మనోజ్‌ కరెంట్‌ తీగ సినిమాలో నటించిన ఈ బ్యూటీ చివరిగా విష్ణు జిన్నా మూవీలో సందడ చేసింది.

కాగా ఈ అందాల తారకు వర్షం అంటే చాలా ఇష్టమట. ముంబైకు వచ్చిన కొత్తలో ఇక్కడి వరదలతో చాలా నష్టపోయిందట.

తీవ్ర వరదల్లో తాను ఇష్టపడి తెచ్చుకున్న మూడు కార్లు కొట్టుకుపోయాయట. దీంతో ఈ బ్యూటీ చాలా బాధపడిపోయిందట

ఈ లగ్జరీ కార్ల కోసం భారీ మొత్తంలో చాలా ఎక్కువ ట్యాక్స్‌ కట్టిందట. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలోనే తయారైన కార్లను వాడుతోందట.

సన్నీ లియోన్‌ ప్రస్తుతం కొటేషన్‌ గ్యాంగ్‌ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. వివేక్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.