29 August 2023

 వావ్! గుడ్ న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్

Pic credit - Instagram

జబర్దస్త్ వేదికపై కమెడియన్‏గా అలరించే సుధీర్‏కు తెలుగు 2 స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ వుంది. సుధీర్, రష్మీ జోడీకి..వారికి సంబంధించిన న్యూస్ కి నెట్టింట మంచి మైలేజ్ వుంది. 

అందుకే సుధీర్ కు... రోజూ రోజుకు క్రేజ్ పెరుగుతూనే వుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే బుల్లి తెర సెలబ్రిటీస్లో ఆయన పేరు ముందుంది

దానికి తోడు ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నారు మన సుడిగాలి. పలు చిత్రాల్లో కమెడియన్, సహయ నటుడిగా కనిపిస్తూనే..మరోవైపు హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

ఇక ఇప్పుడు గోట్ గా.. సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. 

అయితే సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ షోకు ఎప్పటికీ సుధీర్ దూరమే అనే టాక్ వచ్చేలా కూడా చేసుకన్నారు. 

ఇక ఈ కమ్రంలోనే తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఈ స్టార్ బాయ్‌. జబర్దస్త్‌ కు అందరూ అనుకున్నట్టు బ్రేక్ ఇవ్వలేదని.. షార్ట్ గ్యాప్ మాత్రమే ఇచ్చా అంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

ఎస్ ! తనకు ఫినాన్షియల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న సుధీర్.. ఆ విషయంగా మల్లె మాలతో మాట్లాడాఅన్నారు. అయితే వారు కూడా వేరు కారణాల వల్ల చేతులెత్తేయడంతో.. వారిని ఓ ఆరు నెలలు బ్రేక్ అడిగా అన్నారు. 

వారు కూడా సంతోషంగానే బ్రేక్ ఇచ్చారని.. ఇక ఇప్పుడు తన ఇబ్బందులు తీరిపోయాని.. అందుకే తొందర్లో జబర్దస్త్‌ చేయడనికి రెడీ అవుతున్నా  అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. ఇదే విషయంతో మల్లె మాలతో కూడా మాట్లాడా అంటూ.. క్లారిటీగా చెప్పారు సుధీర్.