16 August 2023
కుల విభేదాలకు రాజకీయ నాయకులే కారణం..: హీరో శరత్ కుమార్
కోలీవుడ్ నటుడు, దర్శకుడు చేరన్ ప్రధాన పాత్రలో నటించిన మువీ ‘తమిళకుడిమగన్’. లక్ష్మీ క్రియేషన్స్ చే నిర్మించబడింది ఈ మూవీ
చాలా గ్యాప్ తర్వాత ఇసక్కి కార్వణ్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు శరత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ చిత్ర నిర్మాత ఇస్సక్కీ కార్వానన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో ఈ మూవీ తీసినట్టు తెలిపారు.
తర్వాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. కుల విభేదాలకు కారణం రాజకీయాలేనని వ్యాఖ్యానించారు. మనిషి పుట్టినప్పుడు తన కులమేమిటన్నది తెలియదు.
అదే విధంగా పాఠశాలలో, కాలేజీల్లో అందరూ కలిసి మెలిసి చదువుకుంటారు, ఆడుకుంటారు. కానీ..
రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతే కుల, మత భేదాలు తలకెక్కుతున్నాయి. కుల వివక్షత రూపుమాపడానికి వేరే రాజకీయం ఉంది.
అదే సమానత్వం. దాని కోసం అందరూ పాటు పడాలి. నేనూ రాజకీయ నాయకుడినే. సమానత్వవం కోసమే నా భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయి.
తమిళకుడిమగన్ నిజాన్ని చెప్పే సినిమా. కులవృత్తి గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. కులంపై ఉన్న అభిప్రాయాలను..
బ్రేక్ చేసేలా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని శరత్ కుమార్ అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి