ఐదు నెలలు ఐదు సినిమాలతో సందడి చేయనున్న శ్రీలీల.. 

26 August 2023

Pic credit - Instagram

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. ఇప్పుడు ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. 

ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిన్న సినిమాలతో పాటు.. అగ్ర హీరోలు నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. 

ఇక రానున్న ఐదు నెలల్లో వరుసగా ప్రతి నెలా తన సినిమాలతో అడియన్స్ ముందుకు రాబోతుంది హీరోయిన్ శ్రీలీల. 

ఇక రామ్ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న స్కంద సినిమా సెప్టెంబర్ 15న  భారీ లెవల్లో విడుదల చేయనున్నారు. 

అలాగే బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. 

అలాగే వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ నవంబర్ 10న విడుదల కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. 

ఇక నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తోన్న ఎక్ర్ట్సార్డినరీ మ్యాన్ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్. 

 మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలోనూ నటిస్తోంది శ్రీలీల. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.