వరుస ఫ్లాప్స్.. అయినా తగ్గని ఆఫర్స్.. ఏముంది ఈ చిన్నదానిలో
25 October 2025
Pic credit - Instagram
మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి హాట్ టాపిక్ గా మారి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకటి అయ్యింది.
కథానాయికగా 12 సినిమాలు చేస్తే అందులో కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ కాగా.. మిగిలినవన్నీ ప్లాప్ అయ్యాయి.
ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ శ్రీలీల. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.
ఇంకా హిందీలో అరంగేట్రం చేయకముందే రెండో సినిమా ఆఫర్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం శ్రీలీల ఆషికీ ఫ్రాంచైజీ మూడవ భాగంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నలోపే దోస్తానా 2 చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ కలిసి నటించిన ఒక యాడ్‌ను అట్లీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
పుష్ప-2 మూవీలో ఐటెం సాంగ్ చేయడం తో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాటతోనే ఆమెకు హిందీలో వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు టాక్.
ప్రస్తుతం హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన 'ఆషికి 3'లో నటిస్తుండగా.. తమిళంలో 'పరాశక్తి' తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తోంది.