10 August 2023 

సొగసుల సోయగం సౌమ్య రావు స్టన్నింగ్ స్టిల్స్

Pic credit - Instagram

కర్ణాటకలోని శివమొగ్గలో సౌమ్య రావు జన్మించింది. ఓ వైపు చదువుకుంటునే.. ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా వర్క్ చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  

అనసూయ జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన తరువాత.. ఆ ప్లేస్‌కు చాలా మంది పోటీ పడ్డారు. కానీ చివరకు అనూహ్యంగా సీరియల్ నటి అయిన సౌమ్యరావు ఛాన్స్ కొట్టేసింది.   

జబర్దస్త్ యాంకర్ పొజీషన్ కోసం చాలా మంది యాంకర్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. బెంగుళూరుకి చెందిన సీరియల్ నటికి మల్లెమాల ఛాన్స్ ఇచ్చింది. 

శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది. 

సౌమ్య రావు తీసుకోవడంపై మొదట్లో మల్లెమాలపై విమర్శలు వచ్చాయి. తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ యాంకర్లు ఉండగా.. కన్నడ నుంచి అరువు తెచ్చుకోవాలా..? అంటూ ప్రశ్నించారు. 

సౌమ్యరావు రాకముందే.. జబర్దస్త్ షో పాపులారిటీ తగ్గిపోయింది. ప్రస్తుతం యాంకర్‌గా తన శక్తిమేర ప్రేక్షకులను అలరించేందుకు యత్నిస్తోంది.  

ఈ కన్నడ భామ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 

సౌమ్యకు ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఇస్తున్నారట. రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ.