సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాటలు..

8 August 2023

Pic credit - Instagram

జూనియర్ ఎన్టీఆర్.. మల్టీ టాలెంటెడ్ హీరో.. ఆయన పేరు చెబితే గుర్తువచ్చేది డైలాగ్ డెలివరీ, అద్భుతమైన యాక్టింగ్.. డ్యాన్స్.

కేవలం డాన్స్, యాక్టింగ్ కాదు.. సింగర్‏గా మెప్పించారు. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.

నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్.. ఫాలో ఫాలో సాంగ్ ఆలపించారు. ఈ పాట హిట్ అయ్యింది. 

రాకాసి రాకాసి.. అనే పాటతో మరోసారి సింగర్‏గా అదరగొట్టారు. ఈ సాంగ్ రభస చిత్రంలోనిది. 

చారీ  (వేర్ ఈజ్ ది పంచకట్టు).. అనే పాటకు మరోసారి గాత్రం అందించారు. ఈ సాంగ్ అదుర్స్ మూవీలోనిది. 

ఇక కంత్రి సినిమాలో 1,2,3 నేనొక కంత్రి అనే పాటతో అలరించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. 

ఇక సూపర్ హిట్ మూవీ యమదొంగ చిత్రంలోని  ఓలమ్మి తిక్క రేగిందా  సాంగ్ ఆలపించారు తారక్. 

తెలుగు కాదు.. కన్నడలోనూ సాంగ్స్ పాడారు. చక్రవ్యూహా మూవీలో గెలేయా గెలీయా అనే సాంగ్ పాడారు.