టాలీవుడ్లోకి మరో శ్రీదేవి.. జాబిలిగా మనసు దోచిన తెలుగు అందం..
17 March 2025
Prudvi Battula
Credit: Instagram
తాజాగా విడుదలైన కోర్ట్ సినిమాలో "జాబిలి" అనే అద్భుతమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది నటి శ్రీదేవి అపల్ల.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన ఈ క్యూటీ నటన పట్ల మక్కువతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది.
కాకినాడలోనే తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ కళాశాలో డిగ్రీ అభ్యసిస్తుంది.
ఇన్స్టాగ్రామ్లో ఆమె రీల్స్ చూసిన దర్శకుడు రామ్ జగదీష్ కోర్ట్‌లో నానికి చెప్పగా యూనిట్ కథానాయికగా ఈమెను ఫిక్స్ చేసింది.
కోర్ట్‌లో ఈమె పాత్రకు విమర్శకుల ప్రశంసల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. సినిమాలో ఆమె సహజ నటనతో ఆకట్టుకుంది.
కొత్త నటి అయినప్పటికీ తన తొలి సినిమాలోనే నటనతో తెలుగులో గణనీయమైన అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి.
కోర్ట్ సినిమాలో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ తెలుగింటి పుత్తడి బొమ్మ కోసం వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇప్పటకే ఈ క్యూటీ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..
పూనకాలు తెప్పిస్తున్న స్టార్ హీరోల లైనప్..
తారక్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్.!