పెళ్లి తర్వాత శోభిత దూళిపాళ్ల చేసే సినిమా అదేనా..! 

Rajeev 

13 November 2024

 శోభితా ధూళిపాళ్ల.. ఈ చిన్నదని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు అక్కినేని కోడలు కానుంది. 

2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలిలో జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. గూఢచారి సినిమాతో ఈ చిన్నది పరిచయం అయ్యింది. 

ఆతర్వాత మేజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో మెరిసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లిష్ లోనూ సినిమాలు చేసింది. 

ఇక ఈ అమ్మడు త్వరలోనే అక్కినేని నాగచైతన్యను పెళ్లాడనుంది. కాగా పెళ్లితర్వాత శోభితా చేయబోయే సినిమా గురించి టాక్ వినిపిస్తుంది. 

పెళ్లితర్వాత ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది.