ఉప్పు శనగలు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే !!

Phani CH

13 November 2024

చిన్నపిల్లలు దగ్గర నుండి పెద్దవారి వరకు వేయించిన శనగలు తింటుంటారు.. ఈ ఉప్పు శనగలు పెరుగు చెబితే చాలామందికి చిన్ననాటి మధుర జ్ఞాపకం.

ఈ సింపుల్‌ స్నాక్ చాలామంది తింటుంటారు.. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువమందికి తెలుసు.. అయితే తెలియని వారు ఇప్పుడు తెలుసుకోండి

వేయించిన శనగల లో ఎ, సి, బి6, ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌... వంటి విటమిన్లు, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. 

వేయించిన శనగల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల శనగల్లో దాదాపు 18 గ్రాముల ఫైబర్‌, 20 గ్రాముల ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది.

వేయించిన శనగలు లో ఉండే పోషకాల వలన వీటిని తినడం వల్ల కడుపును నిండుగా ఉంచి ఆకలిని తాగిస్తుంది.. అంతే కాకుండా శక్తి స్థాయిలన పెంచడానికి సహాయపడుతుంది. 

వేయించిన శనగల్లో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది. వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడంతో కాలరీల శాతం తగ్గుతుంది.

వేయించిన శనగల్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.. రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. 

వేయించిన శనగల్లో రాగి, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు.. గుండె ఆరోగ్యానికి మేలు చేసి గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి