కుర్రకారును గమ్మత్తుగ చిత్తుచేస్తున్న శోభిత సోయగాలు..

18 November 2025

Pic credit - Instagram

Phani Ch

తెలుగు పిల్ల తెనాలి పిల్ల  శోభిత ధూళిపాల. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది.

ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది.

ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది.

ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభితా ధూళిపాలకు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.

ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు.

ఈ అమ్మడు అక్కినేని నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక చైతూతో వివాహం తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.

పెళ్లి తర్వాత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కానీ చాలా రోజుల తర్వాత ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.