అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు బిజినెస్ రంగంలో తోపు.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

23 May 2026

చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు తమ సహజసిద్ధమైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు నటి స్నేహ

టాలీవుడ్‌లో 'తొలివలపు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సంక్రాంతి, శ్రీరామదాసు, ప్రియమైన నీకు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించిన స్నేహ.. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 

యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ సహాయ నటిగా రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించిన స్నేహ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో సొంతంగా పట్టు చీరల షాపింగ్ మాల్ ఓపెన్ చేసి బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది. 

తాజాగా స్నేహ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ పిక్‌లో సదరు నటి స్కూల్ యూనిఫామ్‌లో, రెండు జెడలు వేసుకుని ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు.

"ఈమె మన అందాల నటి స్నేహేనా! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఇంత ఇన్నోసెంట్‌గా ఉన్న పాప ఇప్పుడు స్టార్ హీరోయినా అంటున్నారు. 

కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.