చిరంజీవి సినిమాలో సిద్దు నటించకపోవడానికి అదే కారణమా ??

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

చిరంజీవి తన తదుపరిచిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించబోతున్నారు.

ఇక ఈ సినిమా మలయాళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బ్రో డాడీ అనే సినిమాకు రీమేక్ చిత్రం అని తెలుస్తోంది

ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించగా ఆయన కొడుకు పాత్రలో నటించడం కోసం టాలీవుడ్ యంగ్ హీరోని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ పాత్రలో నటించడం కోసం ఇప్పటికే సిద్దు జొన్నలు గడ్డ ఎంపికయ్యారు అంటూ ఓ వార్త ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకున్నారని తెలుస్తుంది.

ఈయన పలు సినిమాలతో బిజీగా ఉన్న కారణంతో డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో తప్పుకున్నారని సమాచారం.