13 August 2023

కమల్ హాసన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్

కమల్ హాసన్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. సౌత్ టూ నార్త్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కమల్.

యూనివర్సిల్ స్టార్ 63 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కూతురు హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర పోస్ట్ చేసింది. తన తండ్రి సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదని..

ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని.. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసే సమయంలో చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది.

అంతేకాకుండా సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం తన వంతు కృషి చేశారని.. ఆరు దశాబ్దలుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూనే ఉన్నారని పేర్కొంది.

ఆయన చేసిన పాత్రలు మరెవ్వరు కూడా చేయలేరు అంటూ తన తండ్రి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది శ్రుతి.

ఇదిలా ఉంటే… ఇటీవలే విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కమల్.. ఇప్పుడు ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీపై అప్డేట్ రానుంది..