నెటిజన్ వింత ప్రశ్న.. శృతిహాసన్ అదిరిపోయే రిప్లై

01 August 2023

Pic credit - Instagram

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. 

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. 

ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. 

ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్‌ చాట్‌లో నెటిజన్స్‌ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. 

ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. 

అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. 

ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్  చేసింది.

దీంతో నెటిజన్‌కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.