ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. ఇక దబిడి దిబిడే
28 October 2025
Pic credit - Instagram
Phani Ch
శ్రద్ధా శ్రీనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో నెట్టింట హోరెత్తిస్తుంటుంది ఈ చిన్నది.
ఈ ముద్దుగుమ్మ న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది.
తెలుగు లో 'జెర్సీ' తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ నటించగా చివరిగా వెంకటేష్ సినిమా 'సైంధవ్'లోనూ ఆమె నటించింది.
‘‘నేను కొద్ది రోజుల నుంచి అధికంగా పద్ధతిగల పాత్రలో నటించడానికి కారణం ప్రేక్షకులు నన్ను అలా చూడాలని కోరుకోవడమే.
ఇకనుంచి నేను లవ్, రొమాన్స్‌తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్ యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది. ఇక నుంచి నేను పద్ధతిగల పాత్రలు చేయాలనుకోవడం లేదు.
అందరూ ఎక్కువ సినిమాలు చేయడంలేదని అడుగుతున్నారు.. అది నా లక్ష్యం కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే నా లక్ష్యం.
కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని డిసైడ్ అయ్యా. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ విభిన్న కథలు.. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది.