‘చూడండి.. ఈ విషయాన్ని ఎవరు అడుగుతున్నారో’.. రాజమౌళి ట్వీట్‌పై శోభు ఫన్నీ కామెంట్..
ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది.
తాజాగా ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు దర్శకుడు రాజమౌళి.
‘‘ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్. అయినా మీరు సాధించగలిగారు.
డార్లింగ్ లుక్స్ అదుర్స్. మూవీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న మిగిలి ఉంది’’ అని అన్నారు అయన.
దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్ థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటె ‘చూడండి.. రిలీజ్ డేట్ కోసం ఎవరు అడుగుతున్నారో’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు నిర్మాత శోభు యార్లగడ్డ.
దాన్ని రీట్వీట్ చేస్తూ ‘హా..హా.. బాగా చెప్పారు శోభుగారు’ అంటూ బదులిచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి