సైలెంట్ అయిన శివాత్మిక.. సినిమా ఎప్పుడంటున్న ఫ్యాన్స్ 

Rajeev 

11 December 2024

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక. ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను, పాత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది శివాత్మిక రాజశేఖర్.

తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే సినిమాలో చేసింది. 

ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఈ చిన్నది సైలెంట్ అయ్యింది. శివాత్మిక ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు

కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. 

నెట్టింట శివాత్మిక ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు ఆశించినంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.