ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ లేరని కొన్ని సినిమాల నుంచి తీసేశారు
10 November 2025
Pic credit - Instagram
Phani Ch
వాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. 2019లో ‘దొరసాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
దొరసాని చిత్రంలో నటనకు సైమా వేడుకల్లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ వంటి తెలుగు చిత్రాలతో పాటు, తమిళంలో ‘ఆనందం విలయదుం వీడు’, ‘నితమ్ ఒరు వానం’ వంటి సినిమాల్లో నటించారు.
గ్లామర్ పాత్రలకు దూరంగా, నటనకు ఆస్కారమున్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతిభ కంటే సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువగా ఉంది. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారని కొన్ని సినిమా ఆఫర్లు చేజారిపోయాయి.
నా స్థానంలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారిని తీసుకున్నారు అని శివాత్మిక వాపోయారు. ఈ పరిస్థితి వల్ల ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవాలంటూ మేనేజర్లు, ఏజెంట్ల నుంచి తనపై ఒత్తిడి కూడా వచ్చిందని ఆమె తెలిపారు.