23 August 2023

పింక్‌ శారీలో కైపెక్కించే పోజులతో శివాత్మిక

Pic credit - Instagram

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ కెరీర్‌ ప్రారంభంలోనే నటిగా నిరూపించుకుంది. అంతా గ్లామర్‌ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కానీ శివాత్మిక నటనతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుందీ భామ. 

హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక నటించింది నాలుగు సినిమాలే. అయినా తనకంటూ ఓ సెపరేట్‌ గుర్తింపుని మరియు పాపులారిటీని తెచ్చుకుంది.

సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. వెండితెరపై నటనతో, సోషల్‌ మీడియాలో అందాలతో అలరిస్తుంది. రెండు రకాల ట్రీట్‌లిస్తూ అలరిస్తుంది. 

శివాత్మిక రాజశేఖర్‌ డస్కీ అందాలతో ఆమె నేచురల్‌గా బ్యూటీని చూపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. మేకప్‌ లేకుండా డేర్‌ చేస్తూ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. 

నెటిజన్లని ఆకట్టుకుంటుంది. నేచురల్‌ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ నేచురల్ యాక్టింగ్‌ పరంగానూ గుర్తింపు తెచ్చుకుంటుంది. అందంతో అలరిస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ పింక్‌ శారీలో చీరలో హోయలు పోతు అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. స్లీవ్‌ లెస్ బ్లౌజ్‌లో క్యూట్ పోజులిచ్చింది శివాత్మిక. తన పరువాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. 

అయితే ఇదంత తన నెక్ట్స్ సినిమా కోసం కావడం విశేషం. చివరగా `రంగమార్తాండ` చిత్రంలో నటించింది శివాత్మిక. ఇందులో ఆమె నటనకు అద్భుతమైన స్పందన లభించింది. 

చాలా మంది ఆమె నటన గురించి మాట్లాడారు. చాలా బాగా చేసిందన్నారు. అంతటి ప్రశంసలు అనంతరం కొంత గ్యాప్‌ తీసుకుంది శివాత్మిక. ఇప్పుడు కొత్త సినిమాని ప్రారంభించుకుంది.