16 February 2024
OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్
సినిమా..
TV9 Telugu
పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం డంకీ.
ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్ 21న విడుదలైన డంకీ సూపర్ హిట్ గా నిలిచింది. పఠాన్, జవాన్‌ల అంత మెప్పించకపోయినా, 470 కోట్ల కలెక్ష
న్లు సాధించింది.
ఇక థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన డుంకీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.
షారుఖ్ ఖాన్ డంకీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానే వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ డంకీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే రోజు షారుఖ్ ఖాన్ నుంచి ఓ మంచి సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర
కటించింది.
దీంతో డంకీ రిలీజ్ డేట్ గురించి చెబుతారని ఆడియెన్స్ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డంకీ సినిమా డ
ైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది.
నెట్ ప్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి రావడమే కాదు.. అలా వచ్చిన కొద్ది గంటల్లోనే దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టింది డంకీ మూవీ.
ఇక్కడ క్లిక్ చేయండి