ఆ చిరది ఈ జన్మ ఫలమో.. ఈమెను స్పృశించింది.. గార్జియస్ సంగీర్తన..
19 April 2025
Prudvi Battula
Credit: Instagram
6 నవంబర్ 2002న కేరళలోని నీలేశ్వర్‌లో విపిన్, సీమ దంపతులకు జన్మించింది అందాల సుకుమారి సంగీర్తన విపిన్.
2023లో వచ్చిన హిగుయిటా అనే ఓ మలయాళీ పొలిటికల్ చిత్రంతో కథానాయికగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ కేరళ కుట్టి.
అదే ఏడాది ఆమె తెలుగు చిత్రం నరకాసురలో కనిపించింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ క్యూటీ.
2024లో సోలై ఆరుముగం దర్శకత్వం వహించిన కాడువెట్టి అనే సినిమాతో తొలిసారి తమిళంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
గత ఏడాది ఆమె రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. అవే ఆపరేషన్ రావణ్, సుహాస్ హీరోగా వచ్చిన జనక అయితే గనక.
బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న జనక అయితే గనక సినిమాలో తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్లో క్రేజ్ విపరీతంగా పెరుగుపోయింది. తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులో చేరిపోయింది.
అసురగణ రుద్ర అనే మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ వయ్యారి. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పవన్ తొలి సినిమా పారితోషకం అంతేనా.?
టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడో తెలుసా.?
ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?