పెళ్లితర్వాత టాలీవుడ్‌కు దూరమైన అందాల భామ అదితి రావు హైదరి

08 November 2025

Pic credit - Instagram

Rajeev 

 అదితి రావు హైదరి .. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది.

ఆ తర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.

బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 

సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ను అందుకుంది. ఆతర్వాత అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల్లో నటించి మెప్పించింది.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.