దక్షిణాది అగ్రకాధానాయిక సమంత దాదాపు 14 సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మయోసైటిస్ కారణంగా కాస్త విరామం తీసుకున్న తాజాగా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు
స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయారు
కానీ వాటన్నింటినీ అధిగమించి నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగారు సమంత. అయితే హోమ్లీ పాత్రల్లో నటించే ఈ బ్యూటీ తొలిసారి ఐటెం సాంగ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు
అయితే సామ్ ఎవరూ ఊహించని విధంగా ఈ రేంజ్‌లో చేయడం చాలామందిని షాక్‌కి గురి చేశారు. ‘ఇలాంటివి అవసరమా?’ అని కూడా చర్చించుకున్నవాళ్లు ఉన్నారు
సామ్ కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి తాజాగా ఓ సందర్భంలో మాట్లాడారు. ‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్‌లో భయంతో వణికిపోయానని చెప్పారు
నా కాళ్లు వణికాయి. నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్‌లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు
కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించింది. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అందుకే చేశాను. కానీ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి చేయాలనుకోవడంలేదని అన్నారు. దీంతో సామ్ ప్రత్యేకపాటను ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయిం