ఆ పోస్ట్ కు లైక్ కొట్టిన సమంత.. విడాకుల పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందా..
Rajeev
21 April 2025
Credit: Instagram
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత, ఏమాయ చేశావేతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.
వరస బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంటూ టాలీవుడ్‌నే షేక్ చేసింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇక స్టార్ హీరో నాగ చైతన్యను ఈ అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా కాలం ఈ ఇద్దరూ కలిసి హాయిగా జీవించారు.
ఆ తర్వాత సడన్ గా విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు .
ఇక నాగ చైతన్య ఇటీవలే శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సామ్ ఇప్పుడు సినిమాలతో బిజీగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఇన్ స్టాలో ఓ పోస్ట్ కు లైక్ కొట్టింది.
"పురుషులు తమ అనారోగ్య భాగస్వాములను వదిలివేస్తున్నారు" అనే పోస్ట్ కు లైక్ కొట్టింది. ఇది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. దీని పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.