సమంత స్టన్నింగ్ లుక్స్.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ పిక్స్

04 November 2025

Pic credit - Instagram

Phani Ch

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గత 15 యేళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న చిత్రాలతో అలరించింది.

ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది.

దాదాపు అందరి స్టార్ హీరోస్ సరసన నటించింది. ఇదే సమయంలో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత.

ఆ తరువాత కొన్ని మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోగా.. తాజాగా నాగ చైతన్య శోభితాను ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత చేతిలో కేవలం మా ఇంటి బంగారం సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమాని కూడా సమంతనే సొంతంగా నిర్మిస్తూ ఉందడం గమనర్హం.

ఈ క్రమంలో సమంత ఈ మధ్య మరి సన్నగా అయిపోయి కూడా.. అభిమానులను కలవరపరుస్తోంది. సమంతకు ఇంకా కూడా అనారోగ్యం అలానే ఉందా అనే ఆలోచనలు కూడా తీసుకొస్తుంది.

ఈ క్రమంలో తాజాగా సమంత బ్లూ డ్రెస్ లో  షేర్ చేసిన ఫోటోలు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.