18 August 2023

సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Pic credit - Instagram

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సైఫ్ అలీ ఖాన్ ఒకరు. 

హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఈమధ్య కాలంలో సౌత్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 

ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రావణాసుర పాత్రలో నటించారు. 

ఇక ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి దేవర సినిమాలో కూడా ఈయన విలన్ పాత్రలో నటిస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఒక్కో సినిమాకు సుమారు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.

ఇలా ఈయన సినిమాలు బిజినెస్ ద్వారా ఏడాదికి సుమారు 25 నుంచి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఇక ఈయన నవాబుల వంశానికి చెందినవారు. 

వీరికి హర్యానాలో చరిత్ర ఉన్న పటౌడీ ప్యాలెస్ ఉంది. ఇది సైఫ్ అలీ ఖాన్  సొంతం. ఈ ఒక్క ప్యాలెస్ విలువ మాత్రమే 800 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా ముంబైలో 12 కోట్లు విలువ చేసే బంగ్లాలు, పదుల సంఖ్యలో లగ్జరీ కార్లు ఉన్నాయి. సైఫ్ కి స్విట్జర్లాండ్ లో రూ 33 కోట్ల విలువైన ఫామ్ హౌస్ లాంటి బంగ్లా ఉంది. 

ఇలా ఈయన ఆస్తులు అన్ని కలిపి సుమారు 1300 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది.