కెరీర్ తొలినాళ్ల నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార సాయిపల్లవి. గ్లామర్ పాత్రల దూరంగా ఉంటూ వచ్చింది.
కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ, మంచి నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఇక సాయి పల్లవి తాజాగా శివకార్తికేయన్ హీరోగా నటించిన ఎస్‌కే21 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిలతో కలిసి కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్న సాయిపల్లవి. కమల్‌హాసన్‌పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.
కమల్ హాసన్ తన ఫేవరేట్ యాక్టర్ అని చెప్పిన సాయిపల్లవి.. తనకు ‘మహానది’ సినిమా అంటే పిచ్చి అని, ఆ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో లేక్కేలేదున్నారు.
కమల్‌సార్‌ని చూస్తే చాలు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్‌లో నటిస్తున్నాను. ఆయనతో ఇప్పటివరకూ నటించే అవకాశం రానందుకు బాధగా ఉందని తెలిపింది.
సినిమా షూటింగ్ సమయంలో కమల్ హాసన్‌ను కలిశానని తెలిపిన పల్లవి, ఆ సమయంలో ఆయన నవ్వుతూ పలకరించిన తీరు జీవితంలో మరిచిపోలేనని తెలిపింది.
ఇది మరిచిపోలేని అనుభవమని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ఇక కొత్త సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని కెరీర్‌లో ఇలాంటి పాత్రలు అరుదుగా దొరుకుతాయని చెప్పుకొచ్చింది.