రామాయణ్ కోసం రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుంటున్న సాయి పల్లవి
Phani CH
23 Jul 2025
Credit: Instagram
సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన నటన తో, డాన్స్ తో అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
సాయి పల్లవి మొదటగా 2008లో మలయాళ చిత్రం కస్తూరిమాన్ లో ఒక చిన్న పాత్రలో కనిపించింది, ఆమె నటనకు ఆరంభం ఈ సినిమానే.
అయితే 2015లో మలయాళ చిత్రం "ప్రేమం" ద్వారా లభించింది, ఇందులో ఆమె మలర్ టీచర్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
తెలుగులో ‘ఫిదా’ తో డెబ్యూ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘ఎం.సి.ఎ’ ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ లో ఈమె సీత పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే సాయి పల్లవి లుక్స్ బయటకు వచ్చాయి.
అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.12 కోట్లు పారితోషికం తీసుకోబోతుందట. ‘రామాయణ్’ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.
రెండిటికీ కలిపి సాయి పల్లవి అంత మొత్తం డిమాండ్ చేసిందట. వాస్తవానికి ఇది బాలీవుడ్ జనాలకి పెద్ద లెక్క కాదు. అక్కడి హీరోయిన్లు ఏకంగా రూ.20 కోట్లు, రూ.25 కోట్లు అంటూ డిమాండ్ చేస్తుంటారు.