12 August 2023

ఆ హీరో కోసం తన్నులు తిన్నా: సాయి పల్లవి

Pic credit - Instagram

సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన అది తక్కువ సినిమాలో అయినను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. 

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఎలాంటి గ్లామర్ షోకి తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే నటిస్తూ వస్తుంది.

ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో గురించి తెలిపింది.

అలాగే ఆ హీరో కోసం ఈమె రిస్క్ చేసి ఇంట్లో తన్నులు తిన్న విషయాలను అందరితో పంచుకున్నారు సాయి పల్లవి.

తాను ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థియేటర్ కు వెళ్లాను.

అయితే ఎవరు తోడు లేకుండా సినిమా చూడటం కోసం వెళ్లి ఆలస్యంగా రావడంతో తన తండ్రి చేతిలో బాగా తన్నులు తిన్నానని తెలిపారు. 

సినిమాకి వెళ్లాలని చెబితే మేమే తీసుకు వెళ్లే వాళ్ళం కదా ఇలా ఒంటరిగా వెళ్లడం దేనికి అంటూ చివాట్లు కూడా పెట్టారు.