ఫుట్‌బాల్‌లో ఛాంపియన్.. ఏకంగా 15 పతకాలు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

27 May 2026

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకు నటనతో పాటు వేర్వేరు రంగాల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. సినిమాల్లోకి రాకముందే పలు విభాగాల్లో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది.

ముఖ్యంగా కొందరు హీరోయిన్లు వెండితెరపై గ్లామర్ ఒలకబోయడమే కాకుండా, నిజ జీవితంలో స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన ఇప్పుడు కథానాయికలుగా దూసుకుపోతున్నారు. 

స్కూల్ రోజుల్లోనే ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి, దాదాపు 15కు పైగా మెడల్స్, కప్పులు గెలుచుకున్న ఆ బ్యూటీ మరెవరో కాదు..  కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సిక.

సాయి ధన్సిక అనగానే టాలీవుడ్ , కోలీవుడ్ ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా 'కబాలి'. ఇందులోత సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిగా కనిపించి పాపులర్ అయ్యింది.

షార్ట్ హెయిర్ కట్‌తో, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌లో ధన్సిక చేసిన నటన అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఆమె సౌత్ ఇండియాలోనే క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది.

ఆ తర్వాత తెలుగులో 'షికారు', 'దక్షిణ' వంటి సినిమాలతో పాటు పలు వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్నతనంలో అసలు నటి కావాలని అనుకోలేదట.

ఒక అథ్లెట్ కావాలనే లక్ష్యంతో స్కూల్ డేస్ నుండి స్పోర్ట్స్‌లో పాల్గొంది. ఫుట్‌బాల్ ఆటలో ఆమె చూపించిన ప్రతిభకు గాను ఎన్నో స్టేట్ లెవెల్, స్కూల్ లెవెల్ కాంపిటీషన్లలో పతకాలను సొంతం చేసుకుంది.  

ఇక కెరీర్ పరంగానే కాకుండా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం పరంగా కూడా ధన్సిక పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. త్వరలోనే విశాల్ ను పెళ్లి చేసుకోబోతుంది ఈ అమ్మడు.