స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న యంగ్ బ్యూటీ రితికా నాయక్ 

22 May 2025

Rajeev 

Credit: Instagram

అందాల భామ రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. 

ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

ముద్దుగుమ్మ రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు.

నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు.

మిరాయ్, వరుణ్ తేజ్ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పంచుకుంటుంది.