సినిమా ఛాన్స్ అడిగితే.. అడ్జస్ట్‌మెంట్ కావాలని కోరాడు
Pic credit - Instagram
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాల్లో అవకాశాలను రాబట్టుకుంది.
కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్‌లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది.
ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
రెజీనా తన పదిహేడేళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయింది. ఆ సమయంలో చాలా మంది నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది.
కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్‌మెంట్‌కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్ పని చూసుకోవచ్చన్నాడు.
ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది. నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు.
రెమ్యునరేషన్ విషయంలో అడుగుతున్నారేమోనని, సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాను.' అని రెజీనా తెలిపింది. తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది.
ఆ ఫోన్ చేసిన వ్యక్తి వేరే రకమైన కోరిక కోరాడని ఆర్థమైంది. ఆ సంఘటన తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు.