20 August 2023

ఓటిటి లోకి రానున్న రీసెంట్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’.. ఎప్పుడంటే.?

తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ టాప్ లో దూసుకెళ్తోన్నఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం గా ఉన్న ‘ఆహా’.

రీసెంట్ డేస్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా బేబీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.  ‘బేబి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది ఆహా.

ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల పొందింది

బ్లాక్ బస్టర్ అయిన ‘బేబి’ అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పింది ఆహా సంస్థ.. 

ఈ గోల్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంట‌లు ముందుగానే బేబి సినిమాను చూసే అవకాశాన్ని కలిపించింది.

ఈ గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ తీసుకున్న వారు సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను 4K డాల్బీ ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా చూడగలరు

ఈ స‌దుపాయం ఇటు తెలుగు, అటు త‌మిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోని స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అందుబాటులో ఉంచింది ఆహా.