రీరిలీజ్ కానున్న రవితేజ వెంకీ.. ఎప్పుడంటే..
రవితేజ హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం వెంకీ.
ఈ చిత్రంలో రవితేజకి జోడిగా స్నేహ నటించింది.
ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు.
బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, తనికెళల్ భరణి ఈ చిత్రంలో కీలక పాత్రధారులు.
ఇందులో కామెడీ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.
కాగా ఈ చిత్రం రీరిలీజ్ కానున్నట్లు కొన్ని రోజులగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా వెంకీ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ 30న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి