డీప్‌ ఫేక్‌ గురించి అందుకే స్పందించా.. 

01 February 2024

TV9 Telugu

నటి రష్మిక మందనకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. 

జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని మార్చి వైరల్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియో చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ వీడియోపై రష్మిక మరోసారి స్పందించారు. ఇలాంటి వీడియోలపై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ఈ అనుభవం కాలేజీ రోజుల్లో ఎదురైతే ఎవరూ మద్దతు ఇచ్చేవారు కాదు. దీని గురించి మాట్లాడితే సమాజం ఏమనుకుంటుందో అని భావించేవాళ్లు.

దీనికి గురించి రెస్పాండ్‌ అవ్వాలా.? వద్దా.? అనే నేనూ ఆలోచించాను. ఇలాంటి వీడియోలపై ప్రజల్లో అవగాహ కల్పించడం ముఖ్యమని భావించాను.

అందుకే డీప్‌ ఫేక్‌ వీడియోపై ఓపెన్‌ అయ్యాను. కాలేజీ అమ్మాయిలకు ఇలా జరిగితే పరిస్థితేంటని భయపడే, వారిలో ధైర్యాన్ని నింపాలనుకున్నాను. 

ఇందులో భాగంగానే.. దీనిపై స్పందించాను. ఇలాంటి వీడియోలు ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయి, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయని రష్మిక చెప్పుకొచ్చారు. 

ఇక కెరీర్‌ విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం.. పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.